దర్శి: శ్రీ మాధవరెడ్డి ఈ టెక్నో స్కూల్‌లో ఘనంగా మ్యాథ్స్ డే వేడుకలు

శ్రీ మాధవరెడ్డి ఈ టెక్నో స్కూల్ లో ఈరోజు గణిత దినోత్సవం (Maths Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు.భారతదేశం గర్వించదగ్గ మహా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని,గణితశాస్త్ర ప్రాముఖ్యత,మన రోజువారీ జీవితంలో గణితం పాత్ర,కంప్యూటర్లు, ఇంటర్నెట్, శాటిలైట్స్ వంటి ఆధునిక సాంకేతికతలో గణిత వినియోగంఅన్న అంశాలపై ప్రసంగాలు చేశారు.ఉపాధ్యాయులు మాట్లాడుతూ,గణితం కేవలం పుస్తకాల్లోని లెక్కలకే పరిమితం కాకుండావిద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సమస్య పరిష్కార నైపుణ్యం, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచే శక్తివంతమైన శాస్త్రమని వివరించారు.భయం లేకుండా గణితాన్ని నేర్చుకుంటే, అది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుందని సూచించారు.అలాగే, శ్రీనివాస రామానుజన్ గారి జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని,అల్ప వనరులతోనూ అపారమైన ప్రతిభను ప్రపంచానికి చూపించిన ఆయన ప్రయాణంవిద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గణిత సంబంధిత ఉదాహరణలు, చిన్న ప్రయోగాలు,మ్యాథ్స్ ఆధారిత ఆలోచనా శక్తిని పెంపొందించే అంశాలను ప్రదర్శించారు.దీంతో కార్యక్రమం మరింత ఆసక్తికరంగా మారింది.మ్యాథ్స్ డే వేడుకలలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనిఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top