అద్దంకి: IPL కిడ్స్ స్కూల్‌లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు

అద్దంకి పట్టణంలోని IPL కిడ్స్ స్కూల్‌లో ఈరోజు క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్‌ను ఆకర్షణీయంగా అలంకరించడంతో పాటు, చిన్నారులను కూడా క్రిస్మస్ థీమ్‌కు అనుగుణంగా ఎంతో అందంగా ముస్తాబు చేశారు.సాంటా క్లాజ్ వేషధారణలు, రంగురంగుల దుస్తుల్లో మెరిసిన చిన్నారులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాటలు, నృత్యాలు, చిన్న చిన్న కార్యక్రమాలతో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని క్రిస్మస్ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో స్నేహభావం, ప్రేమ, పంచుకునే గుణం పెంపొందించడమే లక్ష్యమని స్కూల్ యాజమాన్యం తెలిపింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top