
పిల్లల విద్య అనేది స్కూల్‌తో మాత్రమే పరిమితం కాదు. ఇంట్లో తల్లిదండ్రులు చూపించే దిశ, మాట్లాడే విధానం, రోజువారీ అలవాట్లే పిల్లల నేర్చుకునే శక్తిని నిర్ణయిస్తాయి.ప్రాథమిక దశలో పిల్లలు చూస్తూ, వింటూ నేర్చుకుంటారు. ఈ సమయంలో తల్లిదండ్రులు చదువును భయంగా కాకుండా ఆనందంగా పరిచయం చేయాలి. రోజూ కొద్దిసేపు కథలు చదవడం, అక్షరాలు గుర్తించడం, ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహించడం ద్వారా పిల్లల్లో సహజమైన ఆసక్తి పెరుగుతుంది.తప్పు చేసినప్పుడు కోపం కాకుండా ఓర్పుతో అర్థం చేయిస్తే, పిల్లలు నేర్చుకోవడాన్ని సానుకూలంగా స్వీకరిస్తారు. ఈ దశలో ఏర్పడే అలవాట్లే భవిష్యత్తు విద్యకు పునాది అవుతాయి.
ఈ వార్తను షేర్ చేయండి
