ఈ దశలో పిల్లలు చదువును ఒక బాధ్యతగా భావించడం ప్రారంభిస్తారు. ఇక్కడే తల్లిదండ్రుల పాత్ర కీలకం.రోజువారీ చదువుకు ఒక స్పష్టమైన సమయం నిర్ణయించడం, మొబైల్ వినియోగంపై నియమాలు పెట్టడం, స్కూల్‌లో నేర్చుకున్న విషయాలపై ఇంట్లో చిన్న చర్చలు జరపడం ద్వారా పిల్లల్లో అవగాహన పెరుగుతుంది.పిల్లలు అడిగే ప్రశ్నలకు నిర్లక్ష్యం కాకుండా సమాధానం చెప్పడం, తెలియకపోతే కలిసి తెలుసుకోవడం అనే అలవాటు తల్లిదండ్రులు పెంచితే, చదువు పట్ల పిల్లల్లో భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఈ వార్తను షేర్ చేయండి
